
క్రీడల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం – ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్‌లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ మాట్లాడుతూ –
“ఆరోగ్యవంతమైన సమాజం క్రీడల ద్వారానే సాధ్యమవుతుంది. ఆరోగ్యం క్రీడాకారుల విజయానికి మూలం. కాబట్టి కోచ్‌లు క్రీడాకారులకు క్రమబద్ధంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి” అని అన్నారు.
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, తొమ్మిది రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు, జిల్లా కేంద్రాలలో క్రీడా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ. సోనీ బాలాదేవి మాట్లాడుతూ, యశోద హాస్పిటల్ మరియు ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఈ క్యాంప్ నిర్వహించామని పేర్కొన్నారు.
విశేష స్పందన
24 రకాల ఆరోగ్య పరీక్షలతో నిర్వహించిన ఈ హెల్త్ క్యాంప్ లో మొత్తం780మంది పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ కోచులు, సిబ్బంది, ట్రైనీలు, వారి కుటుంబ సభ్యులు ఉచితంగా ఈ పరీక్షలు చేయించుకున్నారు. అధునాతన పరికరాలతో ఉచిత పరీక్షలు జరపడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ అథారిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవితేజ సమన్వయం చేశారు. డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, సుజాత, అనిత, ఇంజనీర్ అశోక్ కుమార్, పి.ఆర్.ఓ కాలేరు సురేష్, యశోద హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జీవన్, ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.