
బీజేపీలో నన్ను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన
బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి వింతగా నిరసన తెలిపారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్ బాల్ గిఫ్ట్ ఇచ్చారు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి. మంగళవారం బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్‌బాల్ గిఫ్ట్‌గా ఇచ్చారు.
అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో కొందరి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కావాలని తనను టార్గెట్ చేసి..
తనతో ఫుట్‌బాట్ ఆడుకుంటున్నారని ఆవేదన చెందారు. కాగా, ఇటీవల బీజేపీ కార్యకర్తలపై కూడా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడిన విషయం తెలిసిందే. ‘మీకు కార్యకర్తలు అవసరం లేదా?’ అని ఓ నాయకుడు ప్రశ్నించగా, కార్యకర్తలతో పనిలేదని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.
ఈ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ నేతలపై హాట్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.