
వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం.. డీఎంహెచ్‌వో పై ఎమ్మెల్యే ఆగ్రహం..
ఆసిఫాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్, డీఎంహెచ్‌వో పై ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఓ గిరిజన ప్రెగ్నెన్సీ మహిళా పాయిజన్ తీసుకొని జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది.
అయితే ఆ మహిళకు వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించడంతో సదరు మహిళ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే ఎమ్మెల్యే సూపరిడెంట్తో పాటు డీఎంహెచ్‌వో సీతారాంకు ఫోన్ చేసింది.
ఇద్దరు స్పందించక పోవడంతో ఎమ్మెల్యే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లింది. అత్యవసర పరిస్థితుల్లో రోగులు దవాఖానాకు వస్తే..
వైద్యం అందించాల్సిన డాక్టర్లు అందుబాటులో ఉండరు.. ఉన్న సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తారు..! మీరు ఓ ఎమ్మెల్యే ఫోన్ చేసినా లిఫ్ట్ చేశారని సూపరిడెంట్ పై మండిపడ్డారు. ఎమ్మెల్యే ఫోన్ నే లిఫ్ట్ చేయలేదంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని నిలదీశారు.
సూపరిడెంట్ మాత్రం మీ ఫోన్ నంబర్ లేదని చెప్పుకొచ్చారు.108 అంబులెన్స్‌లో డీజిల్ లేకపోవడంతో ఎమ్మెల్యే స్వయంగా డీజిల్ పోయించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల తరలించారు.