
గంగమ్మ ఒడికి గణనాథుడు...
వేలంపాటలో రు.18,016 లడ్డును దక్కించుకున్న ఇందుర్తి ఉదయశ్రీ,మధుసూదన్ రెడ్డి దంపతులు.
సి కె న్యూస్, తిరుమలాయపాలెం.
తిరుమలయపాలెం మండలంలోని కాకరవాయి గ్రామంలో గణపతి దేవుడి నిమజ్జనం శుక్రవారం వైభవంగా నిర్వ హించారు.
9 రోజులపాటు పూజలందుకున్న విగ్రహాలను నిమజ్జ నానికి తరలించారు. ముందుగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలుచోట్ల లడ్డు వేలంపాట నిర్వహించారు..
గణపతి నిమర్జనం సందర్భంగా.. లడ్డు వేలం పాటలో వేద పండితులు నవిలే సురేష్ శర్మ ఆధ్వర్యంలో సుమారు పదిమందికి పైగా వేలంపాటలో పాల్గొనగా కుమ్మరి బజార్లో నిర్వహించిన గణపతి దేవుడు వద్ద ఇందుర్తి ఉదయశ్రీ,మధుసూదన్ రెడ్డి దంపతులు రు.18016 లకు లడ్డును దక్కించుకున్నారు..అనంతరం వీధుల్లో మేళ తాళాలు, డప్పుశబ్దాల మధ్య వినాయ కుడిని ఊరేగించారు. విగ్రహాల ముందు చిన్నపిల్లలు, యువ కులు సంతోషాలతో డ్యాన్స చేశారు. అనంతరం వినాయకుడిని స్థానిక చెరువులలో నిమజ్జనం చేసి గంగమ్మ ఒడికి సాగనంపారు..ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.