
CM రేవంత్ ఇంటి కాంపౌండ్ను కూల్చిన అధికారులు (వీడియో)
ఇంటి స్థలం విషయంలో గల్లీ లీడర్లే ప్రభుత్వ అధికారులను బెదిరిస్తుంటారు. బడా నాయకులు అయితే తమ పలుకుబడితో ఏకంగా వార్నింగ్ ఇస్తుంటారు.
హైడ్రా వచ్చాక ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రోడ్డు విస్తరణలో భాగంగా సీఎం ఇంటి కాంపౌండ్ను అధికారులు కూల్చారు. ఇందుకు సీఎం అడ్డుచెప్పక పోగా.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
అధికారులను బెదిరించడం వంటి ఘటనలను కూడా తరచూ కనబడేవి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా రేవంత్ రెడ్డి తన ఇంటి విషయంలో చూపించిన వైఖరి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
ఏం జరిగిందంటే..?
సిఎం రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఇంటి కాంపౌండ్ వాల్ రోడ్డుకు అడ్డంగా మారింది. ఈ పనులను అడ్డుకోకుండా, ఆయన తన ఇంటి కాంపౌండ్ను తొలగించేందుకు అనుమతించారు.
ఈ నిర్ణయం ప్రజల శ్రేయస్సు పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటిచెప్పింది. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో రాజకీయ నాయకులు తమ పలుకుబడితో పనులను నిలిపివేస్తారు.
కానీ, రేవంత్ రెడ్డి స్వయంగా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా, అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని స్థానికులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సంఘటనతో ప్రజల ప్రయోజనాలే తనకు అత్యంత ముఖ్యమని రేవంత్ రెడ్డి నిరూపించారని అంటున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు “నిజమైన నాయకుడు అంటే ఇలాగే ఉండాలి,” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రేవంత్ రెడ్డి ఒక ప్రజా నాయకుడిగా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, పనులలో చూపిస్తున్న వేగం ప్రజల ఆదరణను పొందుతున్నాయి.
పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ అధికారం అనేది ప్రజల సేవ కోసం మాత్రమే అని ఛాతీ చెబుతున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం తన వ్యక్తిగత ఆస్తులను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడడం గ్రేట్ అని కొనియాడుతున్నారు.