
ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000/-లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి
కాంగ్రెస్ సర్కార్ ఆశ వర్కర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి
పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలి
యూనియన్ జిల్లా మహాసభలో రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్షీ
సి కె న్యూస్ ప్రతినిధి
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని ఆశ వర్కర్లకు పర్మినెంట్ చేయాలని ఆలోపు మిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈరోజు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఖమ్మం జిల్లా ఏడవ మహాసభ జిల్లా అధ్యక్షురాలు జె.మంగమ్మ అధ్యక్షతన మంచి కంటి భవనం ఖమ్మంలో జరిగింది .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
బిఆర్ఎస్ కంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని, ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఆశాల ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఆశాల సమస్యలు మాత్రం నేటికీ పరిష్కారం చేయలేదు.
ఈ కాలంలో ఆశాలకు ఫిక్సిడ్ వేతనం రూ.18,000/- లు నిర్ణయం చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరంచాలని కోరుతూ జిల్లా ఉన్నతాధికారులకు మరియు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆశాలు అనేకసార్లు వినతిపత్రాల ద్వారా విజ్ఞప్తులు చేశారు. ఇప్పటికీ నిరంతరం నిరసనలు, పోరాటాలు నిర్వహిస్తున్నారు.
అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చలనం లేనట్లు వ్యవహరిస్తున్నదని అన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందని హామీలను అమలు చేయమంటే ఇచ్చిన మాటలు హామీలను మర్చి బడ్జెట్ లేదని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం ఆశాల కడుపు నింపే విధంగా పారితోషికాల కాకుండా ఫిక్స్డ్ వేతనాలు నిర్ణయించి కనీస వేతనం 18000 మరియు ఇతర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని లేనియెడల ఆశాలు అసెంబ్లీని ముట్టడించడానికి సిద్ధమవుతారని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులు పి.రమ్య, పి.మోహాన్ రావు, విఠల్, చంద్రశేఖర్, శీలం నర్సింహారావు, జిల్లాఉపేందర్ ,జిల్లా నాయకులు నవీన్ రెడ్డి, బషీరుద్దిన్,వీరన్న, ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా అద్యక్ష కార్యదర్శులు జె.మంగమ్మ,బి.అమల నాయకులు రమణ,సమాదానం,నాగమణి,కమల,రాణి,సరోజిని, జ్యోతి,సాహిబీ తదితరులు పాల్గొన్నారు