
అక్రమార్కులకు అండగా అధికార యంత్రాంగం.
నాళాలు కబ్జా చేసి వాటిపై వాటర్ ప్లాంట్ ఏర్పాటు.
58వ డివిజన్లో ఆక్రమణకు గురవుతున్న నాళాలు, అధికారులకు బాధితులు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకునే పరిస్థితి లేదంటూ స్థానికులు ఆందోళన.
ఖమ్మం : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద ఎక్కువ కావడంతో దిగువ ప్రాంతానికి వరద నీరు చేరి ఇల్లు కోతకు గురవుతున్నాయి ఎన్నో మార్లు అధికారులకు వారి గోడు చెప్పుకున్న వినిపించుకునే పరిస్థితి లేదంటూ బాధితులు ఆవేదన.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 58వ డివిజన్ లోని దొరన్న కాలనీలో వరుసగా కురుస్తున్న వర్షాలకు నీటి ప్రవాహం పెరిగి ఆ ప్రవాహం ఇండ్ల మీదకి రావడంతో ఇంటి పునాదుల మట్టి కొట్టుకుపోయి పునాదులు కోతకు గురవుతున్నాయయి,
అయితే ఎన్ని మార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే పరిస్థితి లేదు పైనుంచి వర్షపు నీరు నాళాల ద్వారా ఒంపుకు ప్రవహించడంతో అక్కడి ఇండ్లు కోతకు గరవుతున్నాయని బాధితుడు తన గోడు వెల్లగ్రక్కాడు.
కొంతమంది మురుగునీరు ప్రవహించే కాల్వను కబ్జా చేసి దానిపై కాంక్రీట్ తో స్టాండర్డ్ పిల్లర్లు ఏర్పాటు చేసి నాలాలపై వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి, ఎటువంటి అనుమతులు లేకుండా డబ్బులు సంపాదించుకుంటున్న అక్రమార్కులపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండడంతో అదునుగా భావించిన అక్రమార్కులు నాలాలను కబ్జా చేస్తున్నారు.
12/4/2025 మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
దొరన్న కాలనీలో సైడ్ కాలువలు (స్మార్ట్ వాటర్ లైన్స్) , డ్రైనేజీలు ఏర్పాటు చేయడం కొరకు శంకుస్థాపన చేయగా రాజకీయ నాయకుల అధికారుల అండదండలతో ఇక్కడ ఉన్న స్థానికులు కొంతమంది ప్రభుత్వ భూమిని, నాలాలను కబ్జా చేసిన భూములు పోతాయని భయంతో ఆ ప్రాజెక్టును సైతం మొదలుపెట్టకుండా అడ్డుపడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే వరద ప్రవాహం పెరిగి వారి ఇల్లు కొట్టుకపోయే పరిస్థితి ఉన్నదని ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి సకాలంలో చర్యలు తీసుకోకపోతే గత సంవత్సరం కురిసిన వర్షాలకు ఎంతో మంది అభాగ్యులు తమ ఇంటిని, కూడు, గుడ్డ, వరదల్లో కొట్టుకుపోయి అనేక రకాల ఇబ్బందులకు తలెత్తిన పరిస్థితి విధితమే మా పరిస్థితి కూడా అలాంటి పరిస్థితి ఎదురవక మునుపే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఇకమీదటైనా అధికారులు స్పందించి ఎటువంటి నష్టం వాటిళ్లకు ముందే తగు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు.