
ఉరి వేసుకొని వ్యక్తి మృతి…
మంచిర్యాల జిల్లా
సెప్టెంబర్ 12 ( సీ కే న్యూస్)
లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన రెఖేంధర్ రవి అనే 45సంవత్సరాల లారీ డ్రైవర్ ఈనెల 9వ 5తారీకున ఇంట్లో ఉరి వేసుకొని చికిత్స పొందుతూ మృతి నిన్న రాత్రి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందాడు.
మృతుడు గత ఆరు సంవత్సరాల క్రితం ఒక లారీ ఫైనాన్స్ లో కొన్నాడు. ఇతనితో పాటి మృతుని బంధువు అయిన వావిలాల జీవన్ అనే అతను కూడా ఒక లారీ కొనడం జరిగింది.
మృతుడు తన లారీ ఫైనాన్స్ మొత్తం కట్టి ఇటీవల డబ్బులు అవసరం ఉండి వేరే వాళ్లకు అమ్ముకున్నాడు. జీవన్ కొడుకు వావిలాల రాజు తను తీసుకున్న ఫైనాన్స్ సరిగా కట్టడం లేదు.
అందుకు ఫైనాన్స్ వాళ్ళు మృతుడు రవికి తన లారీ క్లియరెన్స్ ఇవ్వమంటే రాజు బండికి జమానాథ్ ఉన్నవాని అట్టి డబ్బులు కట్టిస్తే క్లాయరెన్స్ ఇస్తామని ఫైనాన్స్ వాళ్ళు చెప్పడంతో మృతుడు రవి రాజును డబ్బులు కట్టాలని ఇంటికి వెళ్లి అడిగితే రాజు కోపంతో మృతుని డబ్బులు కట్టను ఎం చేసుకుంటావో చేసుకో చస్తే చావు అని చెప్పడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కొడుకు రెఖేంధర్ రాజశేఖర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది.