అధికారుల నిర్లక్ష్యమా లేక మీడియా అవసరం లేదని అహంకారమా?
మీడియా అంటే ఇంత చులకనా ప్రభుత్వ అధికారులకు?
ప్రభుత్వ కార్యాలయాల నుండి మీడియాకు అందని ఆహ్వానం
షాద్ నగర్ లో ప్రభుత్వ అధికారుల వింత ప్రవర్తన
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ఫిర్యాదు చేసిన మీడియా ప్రతినిధులు
శేఖర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం జనవరి 26:( సి.కె న్యూస్ )
షాద్ నగర్ మున్సిపాలిటీలో ప్రతి ఏటా జరుపుకునే స్వాతంత్ర, గణతంత్ర వేడుకలకు అనాది నుండి ప్రభుత్వ శాఖల నుండి మీడియాకు ఆహ్వానాలు లేదా సమాచారం అందేది. కానీ గత రెండేళ్లుగా అధికారులు మీడియాకు సమాచారాన్ని విస్మరిస్తున్నారు.
షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రమైన పట్టణంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఉన్నారు. ప్రతి కార్యాలయం నుండి మీడియాకు తప్పనిసరిగా సమాచారం ఉండేది.
ఈ సందర్భంగా గణతంత్ర వేడుకలలో భాగంగా మండల పరిషత్ కార్యాలయం మున్సిపాలిటీ కార్యాలయం మార్కెట్ కమిటీ శాఖల ఇంకా ఇతర ప్రభుత్వ శాఖల నుండి ఏ అధికారి కుడా మొత్తం మీడియాకు సమాచారం ఇవ్వలేదు.
కేవలం ఎమ్మెల్యే కార్యాలయం నుండి షెడ్యూల్ సమాచారం మాత్రమే ఉంది. ఇతర ప్రభుత్వ శాఖల నుండి ఎవరికి సమాచారం లేదు. ఈ వ్యవహారంపై జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యమా లేక మీడియా అవసరం లేదని అహంకారమా మీడియా అంటే ఇంత చులకనా ప్రభుత్వ కార్యాలయాల నుండి మీడియాకు అందని ఆహ్వానం.
అధికారులు తమ వద్ద సమాచార వనరులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోకుండా మీడియాకు సమాచారం ఇవ్వకపోవడం వెనుక అర్థం ఏమిటో తెలియదు. దీనిపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ఫిర్యాదు చేసిన మీడియా ప్రతినిధులు