
వార్డెన్ నిర్లక్ష్యం… ఇద్దరు విద్యార్థులకు కరెంట్ షాక్
భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామంలోని ఎస్టీ హాస్టల్లో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. హాస్టల్ వార్డెన్ చెప్పడంతో చెట్టు కొమ్మలు కొట్టేందుకు విద్యార్థులు చెట్టు ఎక్కగా, ఇద్దరు కరెంట్ షాక్‌కు గురయ్యారు.
తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్లబుద్ధారం గ్రామంలోని ఎస్సీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు కరెంట్ షాక్‌కు గురయ్యారు.
గొల్లబుద్ధారం గ్రామంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ ప్రాంగణంలో ఇటీవల చెట్ల కొమ్మలు విపరీతంగా పెరిగాయి. పనివాళ్లతో వాటిని కొట్టించాల్సిన హాస్టల్ సిబ్బంది పట్టించుకోలేదు.
దీంతో ఆ చెట్ల కొమ్మలను కొట్టమని గురుకులంలో తొమ్మిదో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులను వార్డెన్ ఆదేశించారు. వార్డెన్ చెప్పడంతో ఇద్దరు విద్యార్థులు కొమ్మలను నరికారు.
ఈ క్రమంలో చెట్టు కొమ్మలు కరెంట్ వైర్‌కు తగిలి ఉండటంతో ఇద్దరు విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు.కరెంట్ షాక్‌తో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులను వెంటనే భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.