
పల్లె దవాఖానాకు కుర్చీలను అందించి తమ ఉదారతను చాటుకున్న ఉపాధ్యాయల దంపతులు
మంచిర్యాల జిల్లా //
సెప్టెంబర్ 14( సీ కే న్యూస్)
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణను గణనీయంగా మెరుగుపర్చాలనే సంకల్పంతో జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని పల్లెదవాఖానాకు 14,000/- రూపాయల విలువగల త్రీసీటర్ కుర్చీల రెండు సెట్లను ఉపాధ్యాయులు బండ శ్రీనివాస్ – అపరంజిత దంపతులు వారి అమ్మానాన్నలు కీ,శే బండ సాయిలు – మరియమ్మల జ్ఞాపకార్థంగా ఆదివారం రోజున అందించారు.
ఈ సేవా కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్ గంగాదేవి, ఆసుపత్రి సిబ్బంది, గ్రామ నాయకులు బొంతల మల్లేష్, నేరెళ్ల రాజన్న, విష్ణు, గౌరయ్య, ప్రభాకర్, బండ రాజారావు, దయాకర్, శ్రీకాంత్ మనికాంత్, హేమంత్, యూత్ సభ్యులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు..
సొంత గ్రామం కోసం ఉపాధ్యాయ దంపతులు అందించిన ఈ దాతృత్వాన్ని గ్రామస్థులంతా కొనియాడుతూ వారి సేవలను అభినందించారు.