
ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డ్ ఆత్మహత్య
పురుగుల మందు తాగి హోంగార్డు మృతి చెందిన ఘటన రుక్మాపూర్ లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ కమిషనరేట్‌లో హోంగార్డుగా పని చేస్తున్న చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని కనకయ్య(46) ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల కుమార్తె వివాహం చేశాడు.
అప్పులు ఎక్కువ కావడంతో ఆదివారం రాత్రి రుక్మాపూర్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు.
బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కాగా కరీంనగర్ అదనపు డీసీపీ రిజర్వ్ భీం రావు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు.