
బిర్యానీలో బొద్దింక కళేబరం..
కోణార్క్ హోటల్ లో ఘటన
నిద్రమత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారి
ఖమ్మం నగరంలోని వైరా రోడ్ లో గల కోణార్క్ హోటల్లోఓ కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేయగా బిర్యానీలో సగం తిన్నాక బొద్ధింక కనబడడంతో షాక్ కు గురైన కస్టమర్ హోటల్ యాజమాన్యాన్ని సంప్రదించగా విషయాన్ని గోప్యంగా ఉంచాలని మీ డబ్బులు మీకు చెల్లిస్తామంటూ కస్టమర్ కు చెప్పడంతో కంగుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఖమ్మం నగరానికి చెందిన మేడిశెట్టి కృష్ణ నగరంలోని వైరా రోడ్డులోని కోణార్క్ హోటల్ లో బిర్యానీ ఆర్డర్ చేశారు.
ఈ క్రమంలో బిర్యాని ఓపెన్ చేసి సగం తిన్నాక అందులో బొద్దింక కళేబరం కనిపించడంతో గమనించి హోటల్ యాజమాన్యాన్ని సంప్రదించగా విషయాన్ని గోప్యంగా ఉంచాలంటూ ఎక్కడ చెప్ప వద్దంటూ మీ డబ్బులు మీకు చెల్లిస్తామంటూ యాజమాన్యం చెప్పడం గమనార్హం.
దీన్ని బట్టి చూస్తే నగరంలోని పెద్దపెద్ద హోటల్ లో బిర్యానీలను ఎలా తయారు చేస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతూ ధనార్జనే ధ్యేయంగా హోటల్ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా ఫుడ్ ఇన్ స్పెక్టర్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రజల ప్రాణాలు హరి అంటున్నా కూడా ప్రభుత్వ నుండి వేతనాలు పొందుతున్న అధికారి మాత్రం తనకేమీ పట్టనట్లు నెలవారీగా మామూళ్లు వసూలు చేసుకోవడం తప్ప ప్రజల ప్రాణాలపై దృష్టి లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
ఏనాడు పెద్ద హోటళ్లలో తనిఖీలు చేసిన పాపాన పోలేదని చిన్న చిన్న హోటళ్లపై ప్రతాపం చూపించడం తప్ప అగ్రకులాలకు చెందిన పెద్ద హోటళ్లపై ఏనాడు కనీసం చిన్న షాంపిల్ తీసిన దాఖలాలు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
గతంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకువెళ్లి కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలైన సంఘటన మరువకముందే సోమవారం కోణార్క్ హోటల్లో బిర్యానీలో బొద్దింక రావడంతో ఖమ్మం నగరంలోని హోటల్లో భోజనం చేయాలంటే ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఫుడ్ ఇన్ స్పెక్టర్ పెద్ద హోటళ్లలో తనిఖీలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.