
జర్నలిస్ట్ ల పక్షాన ఉంటాం
◆ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
◆ జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని టీజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి కి వినతి
ఖమ్మం, సెప్టెంబర్ 17 : మా ప్రభుత్వం ఎల్లప్పుడూ జర్నలిస్ట్ ల పక్షానే ఉంటుందని, ఎవరి పైన తప్పుడు కేసులు పెట్టబోదని జర్నలిస్టులు కూడా తమ విధులను బాధ్యతతో వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మంలోని ఉపముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావు, మరో ఇద్దరు రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం పని చేస్తోందని పేర్కొన్నారు. జర్నలిస్టులపై నమోదు చేయబడిన కేసులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి న్యాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఎలక్ట్రాన్ మీడియా జిల్లా అధ్యక్షులు మామిడాల భూపాల్ రావు, ఐజేయు జిల్లా మాజీ అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, టీజీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కలవకొలను హరీష్ రాజు, మందుల ఉపేందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, పొన్నెబోయిన పానకాలరావు, కిరణ్, నరేష్, బండారు శేఖర్, వెంకటేశ్వర్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఉల్లోజు రమేష్, పాషా, జోషేప్ తదితరులు పాల్గొన్నారు.