
గర్భిణీ స్త్రీల ఆరోగ్యం.. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట..
తెలంగాణ రెవిన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
ఆడబిడ్డలకు అండగా తెలంగాణ ప్రభుత్వం.
21 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత.
రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో తిరుమలాయపాలెం నుండి ములకలపల్లి బ్రిడ్జి వరకు అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.
సీ కె న్యూస్,తిరుమలాయపాలెం ప్రతినిధి కొలిశెట్టి వేణు.
గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలంగాణ రెవిన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
. బుధవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో ఏర్పాటుచేసిన “స్వస్త్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ప్రారంభించారు..
అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలకు,ఆడబిడ్డకు అన్ని విధాలా అండదండలుగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తే ముందుకెళుతుందన్నారు. మహిళల ఆరోగ్య రక్షణకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని ఆయన అన్నారు..
మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యా, వైద్య రంగాలకు ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, గత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగాలను విస్మరించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టాడు. పేదలకు వైద్యం ఎక్కడా ఇబ్బంది లేకుండా డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు.
కేంద్రం మహిళల ఆరోగ్య భద్రత కోసం 15 రోజులపాటు మాత్రమే కార్యక్రమాలు చేపడుతుంటే, ఈ ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు మహిళల ఆరోగ్య ప్రయోజనాల కోసం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
అనంతరం ఆయన 21 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు..కార్యక్రమం అనంతరం రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో తిరుమలాయపాలెం నుండి ములకలపల్లి బ్రిడ్జి వరకు అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీ సునీల్ దత్,జేసీ శ్రీనివాస రెడ్డి,ఆర్డీవో నరసింహారావు,పాలేరు స్పెషల్ ఆఫీసర్ రమేశ్,ఆత్మకమిటి చైర్మన్ చావా డిప్యూటీ డిఎం అండ్ హెచ్చ్ఓ రాజశేఖర్,జిల్లా కాంగ్రెస్ నాయకులు, బీరోలు పీఏసీఎస్ చైర్మన్ రామసహయం నరేశ్ రెడ్డి,పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్,మద్దులపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి,యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దూదిమెట్ల వెంకట్, మాజీ ఎంపీపీలు బోడ మంగీలాల్, కొప్పుల అశోక్, నాయకులు మందడి ఇజ్రాయెల్,గుగ్గిళ్ల అంబెడ్కర్,తాటికొండ కిరణ్ కుమార్,పోట్ల కిరణ్,నీరుడు లాజర్,మండల స్పెషల్ ఆఫీసర్ పుల్లయ్య, ఇతర శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.