
ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి క్యాంపు ఆఫీస్‌లో సీఎం ఫొటో
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు లేకపోవడం పట్ల సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ బుధవారం కార్యకర్తలతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి సీఎం, మంత్రి ఫొటోలను పెట్టారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్న కార్యకర్తలు…. నేరుగా సమావేశ మందిరంలోకి వెళ్లిన కార్యకర్తలు రేవంత్, ఉత్తమ్ ఫొటోలను గోడకు అమర్చారు.
ఎప్పటి నుంచో ఉన్న కేసీఆర్, జగదీశ్‌రెడ్డి ఫోటోలను ముట్టుకోకుండానే బయటకు వచ్చారు. తాము పెట్టిన ఫొటోలను తొలగిస్తే ప్రజాఉద్యమం చేస్తామని వేణారెడ్డి హెచ్చరించారు.
కాగా, ఎమ్మెల్యే కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్టా కిశోర్‌కుమార్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేసుకుంటూ వచ్చి ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు భయానక వాతావరణం సృష్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కాసేపటికే రేవంత్, ఉత్తమ్ ఫొటోలను సమావేశ మందిరం నుంచి తొలగించారు.