
భార్యను చంపిన భర్త…
కుటుంబ కలహాలే కారణం అంటున్న స్థానికులు.
నవ్య శ్రీ చావుకు పలు అనుమానాలు దారితీస్తున్నాయి.
నవ్యశ్రీని చంపి అత్త మామల కు ఫోన్ చేసిన పింగిలి శ్రీనివాస్.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ దుమ్మగూడెం ప్రతినిధి, (సాయి కౌశిక్),
సెప్టెంబర్ 18,
దుమ్మగూడెం మండలం గంగోలు గ్రామంలో జరిగిన ఘటన వివరాలు లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సుజాతనగర్ గ్రామం లో కత్తి నవ్యశ్రీని గంగోలు గ్రామంలో పింగిలి శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇచ్చి 13 సంవత్సరాల క్రితం తల్లిదండ్రుల వివాహం చేశారు పెళ్లిలో పెట్టాల్సిన పూర్తి లాంచనాలను తల్లిదండ్రులు క్రమ క్రమంగా ఇచ్చుకున్నారు.
ఇదే అదునుగా భావించి ఫింగిలి శ్రీనివాస్ ప్రవర్తనలో లోపం ఏర్పడి భార్యపై తరచు అనుమానంతో వేధించేవాడు శ్రీనివాస్ అక్క మరియు తల్లితో కలిసి ఆమెను చిత్రహింసలు పెడుతూ అదనపు కట్నం తెమ్మని ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడు ఈ విషయాన్ని నవ్య తల్లిదండ్రులకు వివరించగా తల్లిదండ్రులు నవ్యశ్రీ కి నచ్చచెప్పి కాపురానికి పంపేవారు ఇది తరచుగా జరుగుతు ఉండేది.
సెప్టెంబర్ నెల 16వ తారీకు మసీదు లైన్ లో కిరాయి కి ఉంటున్న ఇంట్లో భార్యను పిడుగులు గుద్ది తలపై జాతి పై ముఖం పై గాయాలు చేసి నవ్య శ్రీని చంపేశాడు అని స్థానికులు చెబుతున్న మాట.
ఈ విషయం పై బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నవ్య శ్రీ మృతిపై పూర్తి విచారణ జరిపించి పింగిలి శ్రీనివాస్ పై తగిన చర్య తీసుకుంటామని తెలియజేశారు.