
జూనియర్ ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదం… స్వల్ప గాయాలు
టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ యాడ్ షూటింగ్‌లో గాయపడ్డాడు. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్‌లో ఆయన ప్రమాదానికి గురయ్యారు.
ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. దాంతో (Ntr)ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అందించిన డాక్టర్లు.. చిన్న గాయాలే కావడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించినట్టుగా సమాచారం.
ఇక ఈ వార్త తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.