
హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం.. భార్య గొంతు కోసి పరారైన భర్త
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో ఉన్న భార్యను భర్త గొంతు కోసి హతమార్చాడు. కలిసి ఉండలేకపోతే.. విడిపోయి బతకొచ్చు కదా..
చంపుకునుడు దేనికీ.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నప్పటికీ.. కొందరిలో ఆ అవగాహన వచ్చే పరిస్థితి లేదు. పిల్లలు, కుటుంబం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా చంపుకుంటున్నారు.
లేటెస్ట్ గా హైదరాబాద్ కుషాయిగూడలో భార్యను భర్త చంపిన ఘటన కలకలం రేపింది.శనివారం (సెప్టెంబర్ 20) మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడలో భార్య గొంతుకోసి చంపేశాడు భర్త.యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురుకు చెందిన బోడ శంకర్(40), భార్య పేరు మంజుల(35) అనే దంపతులు కాప్రాలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఒక పాప. ఇద్దరు బాబులు ఉన్నారు. నాలుగు రోజుల క్రితం మహేశ్ నగర్ కాలనీలో ఉంటున్న అక్క బావ ఇంటికి కుటుంబంతో కలిసి శంకర్ వచ్చాడు. అర్థరాత్రి అందరు పడుకున్న తరువాత కత్తితో భార్యను విచక్షణారహితంగా నరికాడు.
ఆమె అరుపుల శబ్ధానికి అందరు లేవడంతో అక్కడి నుంచి శంకర్ పారిపోయాడు. మంజుల ఘటనా స్థలంలోనే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతురాలిని మహారాష్ట్ర ముంబై చెందిన మహిళగా గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




