
కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల కేసు…
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆయనపై ఫిర్యాదు చేసింది.
దీంతో, పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేఏ పాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.
పాల్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక యువతి.. పాల్ తనను లైంగికంగా వేధిస్తున్నారని షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలను షీ టీమ్స్ కు అందచేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ నేపథ్యంలో షీ టీమ్ కేసును పంజాగుట్ట పోలీసులకు ట్రాన్స్ఫర్ చేసింది.
ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. కేఏ పాల్ కంపెనీలో నైట్ షిఫ్టులో పని చేస్తున్న ఓ యువతిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధితురాలు ఆరోపించారు. ఈ క్రమంలో అన్ని వివరాలతో బాధితురాలు.. షీటీమ్స్‌ను ఆశ్రయించారు.
ఈ సందర్బంగా వారి వాట్సాప్ మెసేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, పంజాగుట్ట స్టేషన్లో కేఏ పాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
తనను లైంగికంగా వేధించాడని కే ఏ పాల్ పై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దగ్గరగా ఆనుకుని కేఏ పాల్ మాట్లాడాడు అని యువతి ఆరోపించింది.
షోల్డర్ భాగంలో చేయితో తాకాడు అంటూ యువతి ఫిర్యాదులో పేర్కొంది. 15 రోజులుగా అమెరికన్ కోఆర్డినేటర్ గా యువతి పనిచేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




