
అక్రమఇసుక తరలిస్తే కఠిన చర్యలు : ఎస్ ఐ వీరేందర్
మూడు ట్రాక్టర్లు సీజ్
సికె న్యూస్ చింతకాని ప్రతినిధి. జి పిచ్చయ్య
చింతకాని మండల పరిధిలోని పందిళ్ళపల్లిలో గంధసిరి మున్నేటి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 03 ట్రాక్టర్లను చింతకాని
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీరేందర్ తన సిబ్బందితో కలిసి తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ ఓ ప్రకటనలో ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. .




