
రుణం చెల్లించలేదని బూ*తులు.. మహిళ ఆత్మహత్యాయత్నం..
స్వయం సహాయక సంఘంలో తీసుకున్న లోను చెల్లించలేదని నానా మాటలు తిట్టడంతో మహిళ మనస్థాపంతో పురుగుమందు తాగి చికిత్స పొందుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన ఆయేషా బేగం (30) గత కొన్ని నెలల క్రితం గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘంలో రుణం తీసుకుంది.మూడు నెలలుగా డబ్బులు అందక చెల్లించలేదు.
దీంతో విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ మంజుల గ్రూప్ సభ్యులను ఇంటికి తీసుకువెళ్లి బూతు మాటలు తిట్టింది. అనంతరం ఆయేషా బేగం మనస్థాపానికి గురై వారు వెళ్ళగానే పురుగుల మందు తాగింది.
వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.




