
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి)మండలం మంగలి తండాకు చెందిన రైతు ధరావత్ పంతులు(52) ఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఇల్లందు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడనుంచి ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
దీంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య హంసాలి, కుమారుడు రాజశేఖర్, కుమార్తె మంగమ్మ ఉన్నారు.
మృతుని భార్య హంసలి ఫిర్యాదుతో కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది




