
ఉరేసుకొని మిషన్ భగీరథ కార్మికుడు ఆత్మహత్య
కూసుమంచి: గత రెండు రోజులుగా జీతాలు సకాలంలో ఇవ్వడం లేదని ఎల్ అండ్ టి కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చి.. మిషన్ భగీరథలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు.
కాగా మంగళవారం ఉదయం వరకు సమ్మేలో పాల్గొన్న పాలేరు గ్రామానికి చెందిన చందనబోయిన గాంధీ (32)అనే యువకుడు సమ్మె నుండి ఇంటికి వెళ్లి ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా సమ్మెలో ఉన్న తోటి కార్మికులు ఇప్పటి వరకు తమతో సమ్మెలో ఉన్న గాంధీ వేతనాలు సరిగా అందడం లేదన్న వేదనతో ఉరి వేసుకొని చనిపోయాడని చెబుతున్నారు. కాగా మృతుడికి భార్య ఇద్దరు బాలికలు ఉన్నారు.
కాగా ఎల్ అండ్ టి కార్మికులు గాంధీ మృతదేహంతో పాలేరు మిషన్ భగీరథ ప్లాంట్ వద్ద మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని వెంటనే జీతాలు చెల్లించాలని నిరసన తెలుపుతున్నారు.