
వివాహిత యువతి అనుమానాస్పద మృతి
భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం
సి కె న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని మండలం నాగుల్వంచ గ్రామానికి చెందిన భవ్య తన అత్తవారింటిలో (గోవిందాపురం ఎల్) నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు సమాచారం. భవ్య కు గత నాలుగు నెలల క్రితం
బోనకల్ మండలం గోవిందాపురం (ఎల్)
గ్రామానికి చెందిన అడపాల అనిల్ తో వివాహం జరిగింది. అప్పటినుండి భార్యాభర్తల మధ్య వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంలో మనస్పర్ధలకు గురైన భవ్య ఇంట్లో ఎవరూ లేరు సమయంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు
నోటి వెంట బురుజు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఒక ప్రైవేట్ హాస్పటల్ కు చికిత్స తరలించగా అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారు. భవ్య మృతదేహాన్ని ఖమ్మం హాస్పటల్ నుండి అత్తవారి గ్రామం గోవిందపురం ఎల్ కు తరలించగా సమాచారం తెలుసుకుని ఎస్ఐ వెంకన్న గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టినట్లు సమాచారం.




