
విజయ్ దేవరకొండ కారుకు యాక్సిడెంట్..
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది.
ఆదివారం (అక్టోబర్ 05) తన స్నేహితులతో కలిసి కారులో పుట్ట పర్తికి వెళ్లాడు విజయ్ దేవరకొండ. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు.
అయితే గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం 44వ జాతీయ రహదారి వరసిద్ధి వినాయక పత్తి మిల్లు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. నందికొట్కూరు నుంచి పెబ్బేరుకు పశువులను తీసుకొని వెళ్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో బొలెరో వాహనాన్ని విజయ దేవరకొండ వాహనం ఢీకొంది.
దీంతో విజయ్ దేవరకొండ కారు పాక్షికంగా దెబ్బతింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అందే శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన అనంతరం మరో కారులో విజయ్ దేవరకొండ హైదరాబాదుకు వెళ్లారు. అయితే పుట్టపర్తికి ఆదివారం ఉదయం బయలుదేరిన విజయ్ దేవరకొండ… ఉండవెల్లి మండల శివారులో కారు ఓవర్ స్పీడ్‌గా ప్రయాణించింది.
దీంతో పోలీసులు ఫైన్ వేశారు. సోమవారం సాయంత్రం ఉండవల్లి శివారులోని వరసిద్ధి వినాయక పత్తి మిల్లు దగ్గర విజయ్ కారుకు యాక్సిడెంట్ కావడం గమనార్ధం.




