
అనుమతులు లేని రైజ్ గ్రాండ్ బ్యాంకెట్ హాల్ ప్రారంభం..
ట్రేడ్ లైసెన్సు లేకుండానే నెట్టుకొచ్చిన నిర్వాహకులు..
అధికారుల కంటపడలేదా మాకేంటిలే అని ఊరుకున్నారా ?
పలు పత్రికలకు నోటీసులు పంపిస్తూ
బెదిరింపులు..
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే బాగుంటుంది..
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అక్టోబర్ 06,
కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి హెడ్ ఆఫీస్ వెళ్లే మార్గమధ్యలో సంవత్సరం క్రితం అనుమతులు లేకుండా రైజ్ గ్రాండ్ హోటల్ ను నిర్మించినరు. కానీ అనుమతులు తీసుకోవడం మాత్రం మరిచిపోయారు. వారి మతిమరుపుకి తోడు ఆనాటి మున్సిపల్ అధికారులు కూడా అనుమతులు లేని వాటిని నిలుపుదల చేయడం మర్చిపోయారు. ఇప్పటి వరకు కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నారంటే అధికారులు వారు చెప్పు చేతల్లోనే ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.బిర్యాని బాగా లేక కుళ్లిపోయిన బిర్యాని పెట్టారని పలువురు అధికారులకు ఫిర్యాదులు చేశారు. తూతూ మంత్రంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రావడం అంతా మామూలే.. వారు రావడం ల్యాబ్ కి పంపించడం చాక చాక్యంగా జరిగినప్పటికీ నేటికీ కూడా రిపోర్టు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.అసలు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజా పాలన నడుస్తుందా అని సందేహం వెలుగుతున్న ప్రజలు. ఒక్క జిల్లా అధికారి కూడా వీటిపై స్పందించకపోవడం వెనుక బలమైన రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఒక్క అధికారి కూడా స్పందించిన పాపాన పోలేదు.. ఫుడ్ పాయిజన్ అయి పలుసార్లు పత్రికలలో ఎక్కినప్పటి కీ ఏ ఒక్క అధికారి కూడా చర్యలు తీసుకోలేదు.. చర్యలు తీసుకుంటామంటూ సంవత్సరకాలం గడిపిన అధికారులు చర్యలు మాత్రం తీసుకోలేదు. నూతనంగా ప్రారంభోత్సవానికి సిద్ధమైన అనుమతులు లేకుండానే రైజ్ గ్రాండ్ బ్యాంకెట్ హాల్ పేరుతో మరో ఒకటి ప్రారంభోత్సవం జరుగుతుందంటే అధికారుల అండదండలు ఏ విధంగా ఉందో కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు..