
చలో బస్ భవన్‌కు పిలుపు.. హరీశ్ రావు, KTR హౌస్ అరెస్ట్
హైదరాబాద్‌లో ఆర్టీసీ సిటీ బస్సుల చార్జీల పెంపునకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్‌కు పిలుపునిచ్చారు.
ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గం నుంచి బస్‌భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించనున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
గురువారం ఉదయమే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కోకాపేటలోని వారి నివాసాల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.
ఇక, చలో బస్‌భవన్ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్ బస్టాండ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్‌భవన్ వరకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు.