
సిపిఎం నాయకునీ హ*త్య
సి కె న్యూస్ చింతకాని ప్రతినిధి.
సిపిఎం మాజీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు సీనియర్ నాయకులు కామ్రేడ్ సామినేని రామారావు నీ గుర్తు తెలియని దుండగులు హత్య చేసి కిరాతకంగా చంపారు. పాతర్లపాడు గ్రామంలో ఈ సంఘటన చేటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీనియర్ నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురికావడంపై డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
సీ కే న్యూస్ చింతకాని ప్రతినిధి
దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.
కలుషిత హింసా రాజకీయాలకు తావు లేదని డిప్యూటీ సీఎం అన్నారు.
శాంతి భద్రతలపై ఖమ్మం పోలీస్ అధికారులను సీరియస్‌గా హెచ్చరించిన డిప్యూటీ సీఎం, క్లూస్ టీం, స్నిఫర్ డాగ్స్, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అన్ని మార్గాలను ఉపయోగించి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
సీనియర్ నేత సామినేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మరియు సంతాపాన్ని తెలియజేశారు.
రామారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, పూర్తిస్థాయిలో ఆదుకుంటానని భరోసా ఇచ్చారు డిప్యూటీ సీఎం
 
				



