
అరే.. ఇదేం పని టీచరమ్మా..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
Web desc : పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కొంతమంది టీచర్లు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థులను కంటికిరెప్పలా కాపాడాల్సిన వారు,
వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన వారు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. అయితే, అచ్చం అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మెళియాపుట్టి మండల పరిధిలోని బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ దర్జాగా కూర్చీలో కూర్చొని సెల్ఫోన్లో మాట్లాడుతూ టైమ్‌పాస్ చేసింది.
అంతేకాదు, ఏకంగా పిల్లలతో కాళ్లు నొక్కించుకుంటూ విద్యార్థులపై తన జులూం ప్రదర్శించింది. అయితే, అందుకు సంబంధించిన మొత్తం తతంగాన్ని అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు పిల్లలకు పాఠాలు చెప్పకుండా.. ఇదేం పని టీచరమ్మ అంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.




