
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో టెట్ నోటిఫికేషన్(tg-tet-notification) విడుదలైంది. ఈనెల 15వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.ఈ దరఖాస్తులు స్వీకరణకు తుది గడువు నవంబర్ 29వ తేదీతో ముగియనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
టెట్ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 2026 జనవరి 3 నుండి 31 తేదీల మధ్య పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను నవంబర్ 15వ తేదీ నుండి https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ సారి సర్వీస్ టీచర్లకు టెట్ రాసేందుకు అవకాశం కల్పించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో సుమారు 45వేల మంది టీచర్లు టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ మేరకు టెట్ నిబంధనల్లో మార్పులు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
నవంబర్ 15 నుంచి 29 వరకు అభ్యర్థులు అన్లైన్లో అప్లికేషన్లు సమర్పించాలి. దరఖాస్తుల సమర్పణ తరువాత పరీక్షా కేంద్రాల సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
జనవరి 3 నుండి 31 వరకు ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ TGTET-జనవరి 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది.
నోటిఫికేషన్ విడుదల తేదీ: 14.11.2025
పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
పరీక్ష తేదీలు:03.01.2026 నుండి 31.01.2026 మధ్య రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు.
అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ బులెటిన్ మరియు పూర్తి నోటిఫికేషన్‌ను 15.11.2025 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్:https://schooledu.telangana.gov.in
ఆన్‌లైన్ దరఖాస్తులు:
15.11.2025 నుండి 29.11.2025 వరకు అదే వెబ్‌సైట్‌లో సమర్పించాలి.




