
హరీష్ రావు పై మరో బాంబు పేల్చిన కవిత…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ట్వీట్ చేశారు. కర్మ వెంటాడిందని ఆ ట్వీట్ లో ఆమె పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఫలితం చూశాకనైనా బీఆర్ఎస్ ప్రతి పక్షంగా సరైన పాత్ర పోషించటం లేదని గ్రహించాలని సూచించారు. కేటీఆర్ సోషల్ మీడియాను వదిలి ప్రజల్లోకి వెళ్లాలని పేర్కొన్నారు.
హరీషన్న పార్టీలో ఉండి పార్టీని మోసం చేయటం మానుకోవాలని కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. జూబ్లీహిల్స్ ఫలితం పై కవిత ఆసక్తికర విశ్లేషణ చేసారు. కృష్ణార్జునులు అనుకునే వాళ్లు ఒకరి జబ్బలు ఒకరు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేసారు.
ఒక్క సభ సక్సెస్ అయితే కేసీఆర్ నే మోసినట్లు ఫీలవుతున్నారని చెప్పుకొచ్చారు. హరీష్ అవినీతి బయటపెట్టినా సీఎం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. హరీష్ రావు – సీఎంకి ఏం అండర్ స్టాండింగ్ ఉందో చెప్పాలని డిమాండ్ చేసారు.
బీఆర్ఎస్ ప్రతిపక్షంగా సరిగా పనిచేయకపోతే తామే ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని చెప్పుకొచ్చారు. తనకు పార్టీ పెట్టటం కన్నా కూడా ప్రజల పక్షాన నిలబడటం ముఖ్యమని పేర్కొన్నారు.
ఎక్కడ చూసిన కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందిని.. అయిన సరే కాంగ్రెస్ ఎందుకు గెలిచిందని ప్రశ్నించారు. అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షం బీఆర్ఎస్ పనిచేయటం లేదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలోనే వాళ్లు యుద్ధం చేస్తు న్నారని… ప్రజల్లోకి రావటం లేదని విశ్లేషించారు.
కృష్ణార్జునులు అనుకునే వాళ్లు ఒకరి జబ్బలు ఒకరు చరుచుకోవటం మినహా.. కానీ పెద్ద ఎత్తున ప్రజల కోసం వారి సమస్యల కోసం పనిచేయటం లేదని కవిత వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్ లో విత్ డ్రా చేసుకునే కొంతమంది తన దగ్గరి వచ్చారని చెప్పారు. వాళ్లే హరీష్ రావు గారి దగ్గరికి వెళ్లారని… ఆయన కూడా మీ ఇష్టం అని అన్నారంట అని వాళ్లే చెప్పారని వెల్లడించారు. హరీష్
బీఆర్ఎస్ లో ఉండి కూడా మీ ఇష్టం అంటారా? అంటే పార్టీని మోసం చేయటం కాదా అని నిల దీసారు. ఫలానా క్యాండిడేట్ ను పెడితే సైలెంట్ ఉంటాను అని కూడా కాంగ్రెస్ తో అన్నారంట… అంటూ కవిత వ్యాఖ్యానించారు. కానీ వాళ్లు అందుకు ఒప్పుకోలేదని చెప్పిన కవిత… ఇవన్నీ తెలి సేందుకు సమయం పడుతుందని చెప్పారు.
ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఓడిపోవటంతో హరీష్ రావు గారు ఉంటే ఫలితం వేరేలా ఉండేదని స్టార్ట్ చేశారని.. అంటే తప్పించుకునే రకం వాళ్లు అని కవిత వ్యాఖ్యానించారు. కేటీఆర్ అన్న సోషల్ మీడియాను వదిలి ప్రజల్లోకి రావాలని కవిత సూచించారు.
హరీష్ గారు పార్టీలో ఉంటూ పార్టీని మోసం చేయటం మానేయాలని పేర్కొన్నారు. కృష్ణార్జునులు ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోకుండా… పక్క పార్టీ మీద వేయాలని సూచించారు.
కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకోవాలని… లీడర్లను కాదని చెప్పారు. ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి అంత ఎవరు? అప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు అన్ని ఆస్తులు ఎక్కడివి అంటూ కవిత ప్రశ్నించారు.
2014 కు ముందు తనకు ఎంత ఆస్తి ఉందో ఇప్పుడు అంతే ఉందని చెప్పారు. వాస్తవాలు గమ నించుకోని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ బాగుపడాలని సూచించారు.
హరీషన్న, కేటీఆర్ అన్న కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి అరాచక నాయకులను ప్రోత్సహించారంటూ కవిత వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీలోకి పోను, బీఆర్ఎస్ లో గెంటివేయబడ్డ వ్యక్తిగా సరిచేసుకోవాలని చెబుతున్నానని కవిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.



