
ఏసీబీ వలలో ఇల్లందు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ఇల్లెందు ప్రతినిధి, (సాయి కౌశిక్),
నవంబర్ 17,
ఏసీబీ డిఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి. యాకుబ్ పాషా గతం నెలలో ఒక రేషన్ షాపు తనిఖీ చేసి స్టాక్ తక్కువగా ఉందని కేసు నమోదు చేశారు. షాపును సీజ్ చేశారు. రూ.30 వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డాడు. విజయ్ అనే అసిస్టెంట్ ద్వారా డబ్బులు అడిగించారు. అసోసియేషన్ అధ్యక్షులు శబరిష్ ద్వారా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో డిప్యూటీ తహసీల్దార్, యాకుబ్ పాషా, విజయ్,శబరిష్ లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో లంచం ఇస్తున్న వ్యక్తిని కూడా ఏ సీ బి అరెస్టు చేసింది.




