
ఖమ్మంలో ఘరానా మోసం
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఖమ్మం…
విశ్వసనీయ సమాచార మేరకు స్తంభానినగర్ లో రెడ్డి బోయిన నిలయం అనే అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్-102 లో నివాసం ఉంటున్న ఆలస్యం వినయ్ కుమార్ అనే లక్కీ డ్రా లో 500 రూపాయలకే 30 లక్షల ప్లాటు అంటూ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే సమాచారంతో ఖమ్మం 1టౌన్ ఎస్ఐ, మౌలానా ఆలస్యం వినయ్ కుమార్ ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. విచారణలో నిందితుడు ఆలస్యం వినయ్ కుమార్ @వినయ్ 24సం.లు ప్రజలను మోసగించాలనే ఉద్దేశంతో ఎటువంటి పర్మిషన్ లేకుండా లాటరీ స్కీం కి సంబంధించిన బుక్స్ ప్రింట్ చేపించుకొని, ఒక్కొక్క రిసిప్ట్ కి 500 రూపాయలు తీసుకుంటూ లాటరీలో గెలిస్తే మీకు ల్యాండ్ వస్తుంది అని చెప్పి మోసం చేస్తున్నాడని తెలిపారు. తన తల్లి అయిన ఆలస్యం నాగమణి పేరు మీద నేరడ గ్రామం చింతకాని మండలానికి చెందిన చింతల అనూష పేరు మీద ఉన్న 563-24 Sq.Yds స్థలాన్ని కొని రిజిస్ట్రేషన్ (D.No:4990/2024) చేపించాడు. వాస్తవానికి ఆ స్థలం విలువ అంత లేకపోయిన ముద్దాయి IKF హోమ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్యాంక్ నుండి తనకా లోన్ తీసుకుని, ల్యాండ్ ని 20 లక్షల రూపాయలకు కొన్నట్లు చూపించి రిజిస్ట్రేషన్ చేపించాడు. కానీ ముద్దాయి వాస్తవానికి వారికి ల్యాండ్ అమ్మిన చింతల అనూష గారికి 7 లక్షల మాత్రమే చెల్లించినాడు. ముద్దాయి కొన్న ల్యాండ్ యందు ఒక నాలుగు గదుల రేకుల షెడ్డు కలదు. ప్రజలని ఈ ల్యాండ్ ఎక్కువ రేటు ఉంది అని నమ్మించాలని ముందు నుంచి పథకం వేసుకున్నాడు. పథకం ప్రకారం ముద్దాయి ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో 50 పుస్తకాలు “2026 సంక్రాంతి మెగా బంపర్ ఆఫర్ లక్కీ డ్రా, 500 రూపాయలకే 563 గజాల స్థలము తూర్పు ఫేసింగ్ గల ఓపెన్ ఫ్లాటు(సుమారు 30 లక్షలు విలువ)” ప్రింట్ చేయించినాడు. లక్కీ డ్రాకు సంబంధించి తను ఎటువంటి లైసెన్సు తీసుకోలేదు. ఒక్కొక్క పుస్తకంలో 100 పేజీల చొప్పున మొత్తం 50 పుస్తకాలు కలిపి 5000 పేజీలు అవుతాయి. ఒక్కొక్క పేజీ కి 500 రూపాయలు చొప్పున 5000 పేజీలకి 25 లక్షల రూపాయలు వస్తాయని ప్లాన్ వేసుకుని దీన్ని అమలు చేయడానికి, ప్రచారం నిమిత్తం మరియు టోకెన్లు అమ్ము నిమిత్తం ఒక 13 మందిని ఒక 500 రూపాయల టోకెన్ కి 50 రూపాయల చొప్పున కమిషన్ ఇస్తానని చెప్పి నియమించినాడు. నియమించుకున్న 13 మంది వ్యక్తులకు 23 లక్కీ డ్రా పుస్తకాలు ఇచ్చి మిగిలిన పుస్తకాలని ముద్దాయి వినయ్ కుమార్ తన వద్ద ఉంచుకున్నాడు. ముద్దాయి వినయ్ కుమార్ ఇప్పటివరకు 533 మందికి టోకెన్లను అమ్మి 2,66,500/- పొందినాడు. ముద్దాయి వద్ద నుంచి 27 లక్కీ డ్రా పుస్తకాలు, 533 రిసిప్టులు మరియు ముద్దాయి సెల్ ఫోన్ ని సీజ్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకున్న ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.
ప్రజలకు విజ్ఞప్తి
ప్రజలు ఎవరూ కూడా ఇటువంటి వారిని నమ్మి ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు. ఇటువంటి వ్యక్తులకు సంబంధించిన సమాచారం మీకు తెలిసిన యెడల వెంటనే పోలీస్ డయల్-100 నంబర్ కి లేదా సమీప పోలీస్ స్టేషన్ నంబర్ కి కాల్ చేసి తెలియపరచగలరు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి ఫోన్ నెంబర్లు గోప్య ముగా ఉంచబడతాయి.
ముద్దాయిల వివరములు:
A -1 : ఆలస్యం వినయ్ కుమార్ @వినయ్ R/o: వి.వెంకటాయ పాలెం, రఘునాధపాలెం మండలం, ఖమ్మం.
A-2: M. వీరభద్రం R/o కైకొండాయి గూడెం.
A-3: SK. నజీర్ పాషా R/o ముదిగొండ.
A-4: T. సందీప్ R/o చర్చి కాంపౌండ్, ఖమ్మం.
A-5: P. సాయి తేజ R/o UPH కాలనీ, ఖానాపురం హవేలీ, ఖమ్మం.
A-6: ఓరుగంటి రాము.
A-7: ఇండ్ల రాజా R/o తనికెళ్ళ, కొనిజర్ల మండలం.
A-8: K. కోటేశ్వరరావు, R/o వెంకటాపురం, ముదిగొండ.
A-9: బత్తుల వీరబాబు, R/o తుమ్మలపల్లి, కొనిజర్ల మండలం.
A-10: సైదాచారి, R/o వైరా.
A-11: T. దేవా R/o మంగాపురం తండా, నేలకొండపల్లి.
A-12: M.శ్రీను R/o అల్లిపురం, ఖమ్మం.
A-13: పంది. వెంకన్న.
A-14: వెంకటేష్@ వెంకీ స్వామి R/o నాయుడుపేట, ఖమ్మం.
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
ఖమ్మం 1 టౌన్ PS.


