
మహిళా పైలట్పై మరో పైలట్ ఆత్యాచారం…
Web desc : బేగంపేటలోని ఒక ప్రైవేట్ ఏవియేషన్ సంస్థలో పైలట్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల యువతిపై, అదే సంస్థలో కమర్షియల్ పైలట్‌గా ఉన్న 60 ఏళ్ల రోహిత్ శరణ్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఈ నెల 20న సంస్థకు చెందిన పని నిమిత్తం బిజినెస్ ఫ్లైట్‌లో బేగంపేట నుంచి పుట్టపర్తి మీదుగా బాధితురాలు బెంగళూరు వెళ్లింది.
ఆమెతోపాటు నిందితుడు కూడా వెళ్లాడు. అక్కడ ఓ హోటల్‌లో అసిస్టెంట్ పైలట్‌తోపాటు మరో ఇద్దరు పైలట్లు బస చేశారు. ఈ సందర్భంగా హోటల్ గదిలో ఆమెపై రోహిత్ శరణ్ అత్యాచారయత్నం చేశాడు.
ప్రతిఘటించిన ఆమె అక్కడి నుంచి పారిపోయి హైదరబాద్ చేరుకున్నది. అనంతరం సదరు పైలట్ తనపై లైంగికదాడికి యత్నించాడని బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో రోహిత్ శరణ్‌పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటన బెంగళూరు హలసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.


