
నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి నిరసన సెగ
డబుల్ బెడ్రూం ఇండ్ల జాబిత ఎంపికలో అవినీతి జరిగిందని, అర్హులైన పేద వారిని జాబితా నుండి తీసేసారని ఎమ్మెల్యేపై తిరగబడ్డ ప్రజలు
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేసేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
గత 30–40 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్న మా పేర్లు కాకుండా ఎవరికో తెలియని వారికి ఇండ్లు ఎలా కేటాయిస్తారంటూ నిరసనకు దిగిన స్థానికులు
డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారని స్థానికుల ఆరోపణ
ఏదో సానుభూతితో భూపతి రెడ్డిని గెలిపిస్తే, పేదలను ఆగం చేస్తున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు
పారిపోయేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే కారుకు అడ్డంగా వెళ్లగా, ఆందోళనదారులను అడ్డుకున్న పోలీసులు



