
ప్రేమ జంటను కలిపిన సర్పంచ్ ఎన్నికలు
ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన సర్పంచ్ స్థానంలో తన ప్రేయసిని పోటీకి నిలబెట్టిన బీసీ యువకుడు
యువతి తల్లిదండ్రులు నిరాకరించడంతో రాత్రికి రాత్రే పెళ్లి చేసుకున్న ప్రేమజంట
సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయినట్టు తెలిసి, అదే సామాజిక వర్గానికి చెందిన తన ప్రేయసి శ్రీజతో నామినేషన్ వేయించిన చంద్రశేఖర్ గౌడ్ అనే యువకుడు
ఈ విషయం తెలుసుకుని నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని శ్రీజను కోరిన ఆమె తల్లిదండ్రులు
దీంతో రాత్రికి రాత్రే యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్న ప్రేమజంట
తాను మేజర్ అని, తన ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని, తమను ఇబ్బంది పెట్టొద్దని తల్లిదండ్రులకు శ్రీజ విజ్ఞప్తి
తన భర్త చంద్రశేఖర్ సహకారంతో సర్పంచ్ ఎన్నికల్లో గెలుస్తానని, ఇప్పుడు ప్రజలు తనకు సహకరిస్తే భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి తాను కష్టపడతానని తెలిపిన శ్రీజ
శ్రీజ, చంద్రశేఖర్ గౌడ్ జంటకు మద్దతుగా నిలిచిన స్థానిక బీఆర్ఎస్ నాయకులు




