
ఓల్డ్ సిటీ కత్తులతో బెదిరించి రూ.40 లక్షలు లూటీ
Web desc : గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి రూ.40 లక్షలు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమన్ నగర్ బీలో బిహార్‌కు చెందిన మహమ్మద్ సుల్తాన్(33) నివాసముంటున్నాడు.
ఈయన భార్య గర్భిణి కావడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు.
బెంగాల్, కల్కత్తా తదితర ప్రాంతాల నుంచి వస్తువులను తీసుకువచ్చి గాజులను తయారుచేస్తుంటాడు. వ్యాపార అభివృద్ధి కోసం తన ఊరులో స్థలాన్ని అమ్మి డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. కత్తులతో సుల్తాన్‌ను బెదిరించారు. ఆయనపై దాడి చేయడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. బీరువాలో దాచిన రూ.40 లక్షలు దోచుకున్నారు.
అనంతరం సుల్తాన్‌కు చెందిన బైక్ తీసుకుని పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా భవానినగర్ సీఐ బాలస్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.




