
ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ఆర్ ఐ
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఎసిబికి ఆర్ ఐ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు.
కారేపల్లి ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం ఆర్ఐ దౌలూరి శుభ కామేశ్వరి దేవీ పది వేలు లంచం తీసుకుంటుండగా డిఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో ఆమెను ఎసిబి అదికారులు పట్టుకున్నారు.
కారేపల్లిలో ఇంటి వద్ద ఆర్ఐను అధికారులు పట్టుకున్నారు. ఆర్ఐ ఇంట్లో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.
గతంలో కూడా కామేశ్వరీ లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.


