HyderabadPoliticalTelangana

ఉప్పల్ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మ*హత్య యత్నం

ఉప్పల్ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మ*హత్య యత్నం

ఉప్పల్ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మ*హత్య యత్నం

హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

పద్మావతి కాలనీలో నివసిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తన నివాసం ఉంటున్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ ప్రమీలకు తీవ్రగాయాలైనట్టు తెలుస్తుంది.

2020 బ్యాచ్ కి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమీల నాచారం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుంది.ఉప్పల్ పద్మావతి కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో ప్రమీల భర్త బాలాజీ నాయక్, ఇద్దరు పిల్లలతో కలసి నివాసం ఉంటుంది.

కాగా సోమవారం కుటుంబ సమస్యల కారణంగా కానిస్టేబుల్ ప్రమీల తను నివాసం ఉంటున్న పద్మావతి కాలనీలోని అపార్ట్ మెంట్ లోని 3 అంతస్తు నుండి కిందికి దూకి ఆత్మహత్యయత్నం చేసింది. వేంటనే స్థానికులు హుటా హుటిన ప్రమీలను ఉప్పల్ లోని సిటీ న్యూరో హాస్పిటల్ తరలించారు.

మెరుగైన చికిత్స కోసం ప్రమీలను భర్త బాలాజీ నాయక్ సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రవి పహార్ తండా చెందిన వారు.

కాగా ఉద్యోగరీత్యా ఉప్పల్ పద్మావతి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button