
అక్రిడిటేషన్, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదు.
ఆందోళన వద్దు, మీతో నేనున్నా
డెస్క్ జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి హామీ
హైదరాబాద్ :- అక్రిడిటేషన్ కార్డులకు, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వ పరంగా అక్రిడిటేషన్ కార్డుదారులకు వర్తించే ప్రతి ప్రయోజనం మీడియా కార్డు దారులకు కూడా వర్తిస్తుందని ఈ విషయంలో డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావద్దని జీవో 252లో మార్పులు చేసి లిఖితపూర్వకంగా ఇస్తామని హామీ ఇచ్చారు.
మంగళవారం నాడు సచివాలయంలో తనను కలిసిన టీడబ్ల్యు జేఎఫ్, డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులతో మంత్రిగారు వివిధ అంశాలపై చర్చించి వారి సందేహాలను తీర్చారు.
కొంతమంది అపోహలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వాటిని నమ్మకండి. ఎలాంటి పక్షపాతం లేదు. మీరెవరూ ఆందోళన చెందొద్దు. మీతో నేనున్నాను. రెండు విభాగాలుగా చూడాలన్న ఆలోచన కాదు. ప్రభుత్వ పరంగా అన్ని సంక్షేమ పధకాలను వర్తింపచేస్తాం.
అర్హులైన, నిజమైన జర్నలిస్ట్‌లకు మేలు చేయాలన్న సంకల్పం, సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయం. తెలంగాణ రాష్ట్రంలో మినహా దేశంలో ఇంత పెద్దమొత్తంలో అక్రిడిటేషన్ కార్డులు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాష్ట్రంలోని అన్ని జర్నలిస్ట్ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని ఆ సమావేశానికి డెస్క్ జర్నలిస్ట్‌లను కూడా ఆహ్వానిస్తామని అందరి అభిప్రాయాలను, సలహాలను సూచనలను తీసుకొని జర్నలిస్ట్‌లకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా జీవో 252లో మార్పులు, చేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు.
టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు బి. రాజశేఖర్, గండ్ర నవీన్ ఆధ్వర్యంలో మంత్రిగారిని కలిసిన వారిలో ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు




