PoliticalTelanganaYadadri

మహిళా కానిస్టేబుల్‌పై వివాదం… డ్యూటీ వేళ యూనిఫాంలో ఇన్‌స్టా లైవ్‌..

మహిళా కానిస్టేబుల్‌పై వివాదం… డ్యూటీ వేళ యూనిఫాంలో ఇన్‌స్టా లైవ్‌..

మహిళా కానిస్టేబుల్‌పై వివాదం… డ్యూటీ వేళ యూనిఫాంలో ఇన్‌స్టా లైవ్‌..

Web desc : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ ప్రేమలత చేసిన చర్య సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

డ్యూటీ సమయంలో యూనిఫాంలోనే ఇన్‌స్టాగ్రామ్ లైవ్ నిర్వహించడంతో ఈ ఘటన వివాదాస్పదమైంది. డ్యూటీలో ఉండగానే ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన ప్రేమలత నెటిజన్లతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ‘డ్యూటీ సమయంలో లైవ్ చేయడం ఏంటి?’ అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నించగా, ‘ఇది ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్.. మాకు ఇక్కడ ఏ పనీ లేదు. అందుకే లైవ్‌లోకి వచ్చాను’ అని ఆమె సమాధానం ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

జిల్లా పోలీస్ యంత్రాంగం ఆగ్రహం..

పోలీస్ విభాగంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ఈ తరహా ప్రవర్తన సరైంది కాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. డ్యూటీ సమయంలో సోషల్ మీడియాలో లైవ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఈ వీడియో వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. డ్యూటీ వేళ నిబంధనలను ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో లైవ్ చేసిన వ్యవహారంపై జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది.

యూనిఫాంలో ఉండి శాఖ గౌరవానికి భంగం కలిగించినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మహిళా కానిస్టేబుల్ ప్రేమలతపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button