
వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందాడంటూ ఆసుపత్రి ముందు ధర్నా…
ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళన
చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన గడ్డం సత్తిరెడ్డి (55) సోమవారం రాత్రి కడుపులో ఆయాసంగా ఉందని కామినేని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చాడు.
సుమారు 10 గంటల సమయంలో డాక్టర్లు ఆయనకు ఈసీజీ తీయించి నూతనంగా ఏర్పాటు చేసిన బ్లాక్లో జాయిన్ చేశారు. అదేరోజు రాత్రి 2గంటల సమయంలో మృతిచెందాడు.
దీంతో సత్తిరెడ్డిని జాయిన్ చేసిన బ్లాక్లో ఆక్సిజన్ లేదని, అరగంట అయినా వైద్యులు రాకపోవడంతోనే మృతిచెందాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.
పోలీసులు అక్కడకు చేరుకుని వైద్యులపై కేసు నమోదు చేసినట్లు తెలపడంతో ధర్నా విరమించారు. సత్తిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు.



