ఓటరా..ఒక్కసారి ఆలోచించు
మన తలరాతను మార్చే వజ్రాయుధమే ఓటు
సామాజిక సేవలో.. సాటిలేని మట్టా
మంచిని గెలిపించుకుందాం.
మానవత్వాన్ని కాపాడుకుందాం..
సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలారా
సికె న్యూస్ ప్రతినిధి సత్తుపల్లి
రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుదమైన ఓటు హక్కును వినియోగించే ముందు ఓటరా ఒక్కసారి ఆలోచించు.తియ్యని మాటల వెనుక చేదును పసిగట్టగల పౌరుల్ని గొర్రెల మందలుగా చేసి కసాయి దొడ్డికి తరలించే నాయకుల పనిపట్టండి.
నేడు ఎన్నికలంటేనే డబ్బుతో, మద్యంతో,వివిధ రకాల తాయిలాలతో ముడిపడి ఉన్నది.ఒక్కసారి ప్రలోభాలకు లొంగితే మన రైతులు కార్మికులు యువకులు, నిరుద్యోగు ల భవిష్యత్తును మనం అడ్డుకున్నట్టే.
అందుకే జనం కోసం ధైర్యంగా పోరాడే నేతలను,పాలనలో పారదర్శకత,నిజాయితీకి పట్టం కట్టేవారిని, మంచి మనసు కలిగిన వారిని,సమాజం కోసం స్వలాభాన్ని ఆశించకుండా పని చేయటానికి ముందుకు వచ్చిన వారిని,మన లక్ష్యం ప్రకారం పాలన గావించే వ్యక్తికి మాత్రమే విలువైన ఓటు ముద్రణ వేయాలి.
ప్రాణం పోతున్నా సరే ఓటరు కర్తవ్య నిర్వహణలో వెనుకంజ వేయకూడదు.మనం ఓటు వేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మనలో ఒకడిగా ఉండాలి గాని, మన మీద పెత్తందారీలా ఉండకూడదు.
ఒకవేళ అలాంటి నాయకులను ఎన్నుకున్నట్లయితే జరగబోయే ఎన్నికల్లో వారికి గుణపాఠం నేర్పుదాం. మన ఓటు వేసే వ్యక్తికి మనం గతంలో అవకాశం ఇచ్చామా?ఇస్తే ఎంత వరకు ప్రజల కోసం పని చేశాడా! లేక తన స్వార్థానికి పదవిని వినియోగించుకున్నాడా! అనేది ఒక్కసారి ఆలోచించండి.
ఏదేమైనా వేడెక్కిన రాజకీయానికి మరికొన్ని గంటల్లో ముగింపు పలకనుంది.ప్రశ్నించే గళాలు వినిపించకుండా గొంతు నొక్కుతూ,కన్నేగరెసిన వారి కళ్లకు గంతలు కడుతూ,సమాజాన్ని వెనక్కి నడిపిస్తున్న అసుర సంతతిపై ఓటు అనే వజ్రాయుధాన్నిఉపయోగించండి.
స్వలాభం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం,ప్రగతి కోసం అనునిత్యం పరితపించే కల్మషం లేని నాయకుడిని ఎన్నుకుందాం.ఆకలితో ఉన్నవారికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్న వారికి కొంచెం సహాయం,బాధలో ఉన్న వారికి నేనున్నానని ఓదార్పు,ఏ దిక్కులేని వారికి దిక్సూచిగా నిలిచి నిజమైన మానవత్వం కలిగిన మంచి కుటుంబం నుంచి వచ్చిన నాయకుల్ని ఎన్నుకుందాం.
తమ కష్టార్జితం నుండి కొంత ధనాన్ని ప్రజాసేవ కోసం నిస్వార్ధంగా ఖర్చు పెడుతూ ఆపదలో ఉన్న వారికి కొండంత అండగా,పేదింటి కష్టంలో పెద్దదిక్కుగా మారి అసాధారణ పట్టుదలతో, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో,ఏదో సాధించాలని తపనను కలగలిపి ప్రజలలో జనశక్తిగా ఏదిగిన వారే సత్తుపల్లి ముద్దుబిడ్డలు సమాజసేవే జీవిత ఆశయంగా ముందుకు సాగుతున్న డాక్టర్ మట్టా దయానంద్,రాగమయి దంపతులు.
మానవత్వానికి- మంచితనానికి మరో రూపమే మట్టా కుటుంబం.ఎందరో అభాగ్యులకు,అనాధలకు అండగా అమ్మ ఒడిలా నిలిచింది వారి కుటుంబం.ప్రజలనే దేవుళ్ళుగా భావించి కష్ట సమయాల్లో ప్రభుత్వాలు చేయలేని పనులను సైతం చేస్తూ ఎందరిలోనూ ఆత్మ స్థైర్యం నింపిన కుటుంబం.
దైవం అంటే గుళ్లో ఉండే విగ్రహం మాత్రమే కాదని,మనలోని మానవత్వమే అని నమ్మిన కుటుంబం వారిది.ప్రార్ధించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నానుడిని నిజం చేసిన కుటుంబం వారిది.భరోసా అంటే ఓ చిన్న ఆసరా. భరోస అంటే ఓ మాటతో,ఓ చూపుతో,ఓ స్పర్శతో నేనున్నాను,నీతోనే ఉన్నాను అని తెలియజేయడం.
అలా ఎందరికో భరోసా కల్పించిన కుటుంబం వారిది.ఎండలో గొంతు ఎండిపోయిన గొంతులకు మజ్జిగతో దాహం తీర్చిన భగీరథులు.ఎంతోమంది కార్మికులకు హెల్త్ కార్డులు ఇచ్చి వారి జీవితాలకు ఆసరాగా నిలిచారు.
డబ్బే పరమావదిగా వైద్యం చేస్తున్న ఈ రోజుల్లో ఎన్నో పేద కుటుంబాలకు ఉచిత వైద్యం అందిస్తూ వారి జీవితంలో వెలుగులు నింపారు.ఎన్నో ఒత్తిడిలు,ఎన్నో ఒడిదుడుకులు,ఎన్నో అవమానాలు,ఎన్నోసార్లు అవహేళనలు ఎదురైన జనమే వారి శ్వాసగా ఎవరికి లొంగకుండా జనమే తమ బలమని ముందుకు సాగుతూ ఉండటంతో ఆర్థికంగా వెనకడుగులో ఉన్న నేడు జనం మాత్రం వారి వెంట నిలిచారు.
ఎవరికైన కష్టం వచ్చిన విషయం తెలిస్తే చాలు వెంటనే స్పందించి వారి కష్టాల్లో పాలుపంచుకుంటారు.ఆయన చేస్తున్న సేవలు చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు ఎన్నో ఆటంకాలను సృష్టించిన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పేద,ధనిక అనే తేడా లేకుండా సేవే సంకల్పంగా ముందుకు దూసుకు వెళ్ళారు ఆ దంపతులు.
అందుకే వారు చేసిన సేవలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. మనలో కూడా మానవత్వం మిగిలే ఉందని నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. అందుకే చేయి చేయి కలుపుదాం.చేతి గుర్తుపై ఓటేద్దాం.మంచిది గెలిపిద్దాం.. మానవత్వాన్ని కాపాడుకుందాం.