
ఓ ఇంట్లో భారీ పేలుడు.. దంపతులకు తీవ్ర గాయాలు
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 51 డివిజన్ లోని ఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ లైన్ లో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం.. ఉదయం పెద్ద శబ్దం రావడంతో ఏం జరిగిందో అర్థంకాక బయటకు వచ్చి చూడడంతో ఇంట్లో మంటలు రావడం గమనించమని తెలిపారు. ఆ ఇంట్లో ఇద్దరు దంపతులు ఉంటున్నారు.
వారు ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో ఉపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తున్నారు. నారాయణరావుకు స్వల్ప గాయాలు కాగా, భార్య రమాకు కాలు భాగంలో కాలినట్లు స్థానికులు చెబుతున్నారు.
వెంటనే వారిద్దరిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫైర్ అధికారులు మాత్రం షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చని చెబుతున్నారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు కూడా మంచిగానే ఉన్నాయని చెబుతున్నారు.
ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో అగ్నిప్రమాదం తో వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.




