
ట్రాఫిక్ సెన్స్ లోపల వల్లే ప్రాణాలు హరిస్తున్నాయి..
“ట్రాన్స్పోర్ట్ వాహనాలలో అధిక సంఖ్యలో ప్రయాణాలు..”
“నామ్ కే వాస్తి గా పనిచేస్తున్న ఆర్టీవో శాఖ..”
“అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రయాణికుల ప్రాణాలు హరహర..”
“ట్రాన్స్పోర్ట్ వాహనాలలో ప్యాసింజర్ల నిలిపివేత తప్పనిసరి..”
“ములుగు జిల్లా సీకే న్యూస్ ప్రతినిధి భార్గవ్.”
ములుగు జిల్లా వాజేడు మండలం మండపాక గ్రామ సమీపంలో కాంక్రీట్ కూలీల వాహనం బోల్తా, ఒకరు మృతి పలువురికి గాయాలు. క్షతగాత్రులను 108 ద్వారా ఏటూరునాగారం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు జరిగిన సంఘటనపై మరింత వివరణ తెలియాల్సి ఉంది.
. ఆకస్మికంగా చోటు చేసుకున్న ఘటనపై రంగ ప్రవేశం చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.. పొట్ట చేత పట్టుకొని రెక్క ఆడితే కానీ డొక్కాడని కార్మికుల బతుకులు ట్రాఫిక్ సెన్స్ వైపల్యం వల్ల కార్మికుల ప్రాణాలు గాల్లోకి కలుస్తున్నాయి..
గతంలో కూడా మిర్చి కోత రైతులు ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను తరలించే క్రమంలో కూడా ఎన్నో ఘటనలు ప్రమాదానికి గురైనప్పటికీ, సంబంధిత రవాణా శాఖలో మాత్రం చలనం లేదు ములుగు జిల్లా వ్యాప్తంగా ఇసుక క్వారీలు అధిక సంఖ్యలో కొనసాగుతున్నందున, రోడ్ల దుస్థితి విషమించినందున ప్రయాణికులు జర అప్రమత్తంగా ప్రయాణాన్ని కొనసాగించాలి అంటూ పలువురి సూచన విధానం. ఇప్పటికైనా సంబంధిత శాఖ నిద్ర మత్తును వేడి జరుగుతున్న విపత్తుల విషయంలో అప్రమత్తంగా అధికారులు ప్రవర్తించాలి అంటూ ప్రయాణికులలో పలువురు సూచన..




