
సర్పంచ్ మిర్చిపంటపై గుర్తుతెలియని దుండగులు కలుపుమందు పిచికారీ..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపును జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు దుర్మార్గపు చర్యకు పూనుకున్నారు. సర్పంచ్‌గా గెలిచిన వ్యక్తిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్ని అతడు సాగుచేస్తున్న మిర్చిపంటపై కలుపుమందు పిచికారీ చేయించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోటపాడులో బీఆర్‌ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీచేసిన కొంటెముక్కల వెంకటేశ్వర్లు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.
దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ వ్యక్తులు సర్పంచ్ సాగు చేస్తున్న మిర్చిపంటపై శనివారం అర్ధరాత్రి దుండగులతో కలుపుమందు కొట్టించారు.
ఆదివారం ఉదయం మిర్చి పంటను సర్పంచ్ వెంకటేశ్వర్లు తండ్రి శ్రీనివాసరావు చూడగా పంటపై కలుపుమందు కొట్టినట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ మండల నాయకులు..దెబ్బతిన్న మిర్చి పంటను పరిశీలించారు.
ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ గెలుపును తట్టుకోలేక కాంగ్రెస్ వ్యక్తులు ఇలాంటి చర్యలకు పూనుకోవడం సరికాదని హితవు పలికారు.
వ్యవసాయశాఖ మంత్రి నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



