CinemaKhammamKusumanchiPoliticalTelangana

కూసుమంచి’ హీరోకి.. అవార్డుల పంట

కూసుమంచి’ హీరోకి.. అవార్డుల పంట

లోకల్ టూ గ్లోబల్…

‘కూసుమంచి’ హీరోకి.. అవార్డుల పంట

== చిన్న ఫిల్మ్ కు ఇంటర్నేషనల్ అవార్డులు

== 75 ఇంటర్నేషనల్ అవార్డులందుకున్న ‘జాన్’ అనే మ్యూజికల్ ఫిల్మ్

== కూసుమంచి కి చెందిన రాజీవ్ సిద్ధార్థ్ కు బెస్ట్ డైరెక్టర్ అవార్డు

== విమ్మర్శకుల ప్రశంసలు అందుకుంటున్న కూసుమంచి కుర్రోడు..

కూసుమంచి, జనవరి 6:

అతి చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన యువకుడి కథ ఇది.. మారుమూల గ్రామానికి చెందిన ఈ యువకుడు సినిమాలో హీరోగా, డైరెక్టర్ గా అంతర్జాతీయ స్థాయి అవార్డులను అందుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. లోకల్ టూ గ్లోబల్ అనే తీరులో ఆయన ప్రయాణం సాగుతోంది.. హీరోగా మొదటి సినిమాతోనే తన హీరోయిజం చూపించిన ఆ యువకుడు ప్రస్తుతం డైరెక్టర్ గా సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.. ఆయన తీసిన మొదటి మ్యూజికల్ ఫిల్మ్ కు 75 ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్నారు..ఆ యువకుడు ఎవరు..? ఎందుకు అవార్డులు వచ్చాయి.. ఎన్ని అవార్డులు వచ్చాయో.. పూర్తి వివరాల్లో చూద్దాం..

== చిన్న వయస్సు నుంచే సినిమా రంగం పై మక్కువ

ఖమ్మం జిల్లా, కూసుమంచి గ్రామానికి చెందిన బి. చంద్రు, వినోద దంపతులు వ్యవసాయం సాగు చేసుకుంటూ ప్రస్తుతం కూసుమంచి గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడైన ‘రాజీవ్ సిద్ధార్థ్’ చిన్న నాటి నుంచి ఖమ్మంలో చదువుకున్నారు. ఎక్స్ లెంట్ కాలేజీలో ఇంటర్ మీడియట్, కిట్స్ కాలేజీలో బిటెక్ పూర్తి చేశాడు. సినిమా రంగంపై మక్కువ పెంచుకున్న రాజీవ్ 20 ఏళ్ల వయస్సులో హైదరాబాద్ వెళ్లి నటనపై ద్రుష్టి సారించాడు. ఈ రంగంపై తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినప్పటికి వారిని ఒప్పించిన రాజీవ్ సినిమా రంగంపై మక్కువతో హైదరాబాద్ లో ఉండిపోయాడు. ముందుగా ప్రముఖ టీవీ ఛానళ్లలో క్రియోటివ్ డైరెక్టర్ గా కొంత కాలం పనిచేశాడు. అమృతం, సింధూరం, సుందరకాండ, ఆరాధన వంటి సీరియల్స్‌కు ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ లో పని చేశాడు. అలాగే సౌండ్ ఇంజినీరింగ్, డబ్బింగ్ లాంటి టెక్నికల్ డిపార్ట్‌మెంట్లలో కూడా పనిచేశాడు.

== సినిమా నటుడిగా

రాజీవ్ కు చాలా రోజుల తరువాత కొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.. ఎక్స్ ప్రెస్ రాజా, పంతం, దేవదాస్ సినిమాల్లో నటించే అవకాశం రావడంతో సినిమా రంగంలో మంచి గుర్తింపు వచ్చింది.. ఆయన నటన చూసిన సినిమా రంగం హీరోగా అవకాశం కల్పించింది. ‘ఏమైపోయావే’ సినిమా లో హీరోగా పనిచేశాడు. ఆ సినిమా మంచి సక్సెస్ కావడంతో పాటు మంచి నటన సినిమా రంగంలో మంచి గుర్తింపు పొందాడు. దీంతో మరికొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ రాజీవ్ కు డైరెక్షన్ పై మక్కవ ఉండటంతో ఆ అవకాశాలను వదిలేసుకున్నాడు.

== ‘జాన్’ ఫిల్మ్ కు డైరెక్టర్ గా..

చాలా రోజుల తరువాత రాజీవ్ సిద్ధార్థ్ కు డైరెక్టర్ గా మారాడు. జాన్ అనే మ్యూజికల్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించాడు. స్వీయ నిర్మాణంలో గడిచర్ల రాంచరణ్ మ్యూజిక్ అందించి, కల్యాణ్ సమి సినిమాటోగ్రఫి లో జాన్ మ్యూజికల్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించాడు. 2025 నేషనల్ అవార్డు విన్నర్ వి.వి.ఎన్.ఎస్. రోహిత్ పాడిన పాటలకు అద్భుతంగా ఉన్నాయి. మొదటి ఫిల్మ్ అయినప్పటికి ప్రజల నుంచి సినిమా రంగం నుంచి అద్భుతంగా రెస్పాన్స్ రావడం గమనర్హం. సినిమా రంగంతో పాటు రాష్ట్రపతి, గవర్నర్, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు రాజీవ్ సిద్ధార్థ్.

== 75 ఇంటర్నేషనల్ అవార్డులు

రాజీవ్ దర్శకత్వం వహించిన
“జాన్” కు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వస్తున్నాయి. సుమారు 75 ఇంటర్నేషనల్ అవార్డులతో పాటు, 50 వరకు రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకున్నారు. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సింగర్, బెస్ట్ నిర్మాత, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ మ్యూజిక్ లాంటి ఎన్నో అద్భుతమైన అవార్డులను అందుకుంటున్నారు. క్రౌన్ ఇంటర్నేషనల్ ఫీల్మ్ అవార్డు-2025, నేపాల్ ఇంటర్నేషనల్ ఫీల్మ్ ఫెస్టివల్- 2025, నాగాలాండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒన్ లైఫ్ ఇంటర్నేషనల్ ఫెల్మ్ ఫెస్టివల్, వరల్డ్ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, గ్లోబల్ ఇండి కెనీ అవార్డ్ లాంటి అనేక ఇంటర్నేషనల్ అవార్డులను జాన్ ఫిల్మ్ తో పాటు డైరెక్టర్, నిర్మాత అయిన రాజీవ్ సిద్ధార్థ్ అందుకున్నారు. దీంతో సినిమా రంగంతో పాటు ప్రముఖులు రాజీవ్ ను, జాన్ మ్యూజికల్ ఫిల్మ్ ను అభినందిస్తున్నారు. అంతే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న కూసుమంచి మండలంలోని ప్రజలు రాజీవ్ కు పోన్ ద్వారా అభినందనలు చెబుతున్నారు.

== తల్లిదండ్రుల ప్రోత్సహంతోనే : రాజీవ్

ఒకప్పుడు హీరోగా “ఏమైపోయావే” సినిమాలో నటించిన నేను, ఇప్పుడు దర్శకుడిగా “జాన్” తో అంతర్జాతీయ అవార్డులు అందుకోవడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఈ ప్రయాణంలోనా అమ్మానాన్నల ఆశీర్వాదం, మిత్రుల ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేనివి.
ఇది నా గమ్యం కాదు…ఇది నా కథలో మొదటి అధ్యాయం అనుకుంటున్నాను. మంచి సినిమాలకు దర్శకత్వం వహించి మా ఊరికి, మా జిల్లాకు, మా తల్లిదండ్రులకు పేరు తీసుకోస్తాననే నమ్మకం ఉంది. హీరోగా మరిన్ని సినిమాలు చేసి ప్రజలను మెప్పిస్తానని మాటిస్తున్నాను.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button