
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన ప్రమాదం
మహబూబ్నగర్ ఏనుగొండలో గురువారం ఉదయం ఒక ప్రైవేటు స్కూల్ బస్సుకు భారీ ప్రమాదం తప్పింది.
స్థానిక శ్రీనివాసకాలనీలో ఉన్న ‘శ్లోక స్కూల్’ బస్సు ఏనుగొండలో స్కూల్ పిల్లలను తీసుకుని తిరిగి యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది.
ప్రమాద సమయంలో బస్సులో 20 మంది స్కూల్ పిల్లలు ఉన్నారు. పిల్లలకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.



