
సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొన్న డీసీఎం.. స్పాట్ లొనే ముగ్గురి కూలీలు మృ*తి
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం(జనవరి 9వ తేదీ) తెల్లవారజామాను మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఈ ప్రమాదంలో స్పాట్లోనే ముగ్గురు మృతిచెందారు. వివరాలు… బైపాస్ మలుపు వద్ద సిమెంట్ ట్యాంకర్ టర్న్ అవుతుండగా టైల్స్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న టైల్స్ అన్ని అందులో ఉన్న కూలీలపై పడటంతో ముగ్గురు కూలీలు స్పాట్లోనే ప్రాణాలు విడిచారు.
మరో ముగ్గురికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే డీసీఎం హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తుండగా, సిమెంట్ ట్యాంకర్ గుంటూరు వైపు నుంచి మిర్యాలగూడ వైపునకు వస్తుంది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, గాయపడిన వారిని చికిత్స సమీప ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.



